![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -150 లో.....గంగపై శకుంతలకి పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలోపు గంగని ఇంకా నెగెటివ్ చెయ్యాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు. అసలు గంగనే విషం కలిపి తనే తిని సింపథీ కొట్టేసి మళ్ళీ ఈ ఇంట్లోకి రావడానికి ట్రై చేసిందని శకుంతలతో ఇషిక అనగానే శకుంతల అదంతా నమ్మేస్తుంది.
గంగని చూడడానికి వాళ్ళ అమ్మ వస్తుంది. దాంతో కూతురు తల్లి రోగం పేరు చెప్పి మోసం చెయ్యడం మళ్ళీ ఏం ఎరుగనట్లు ఇలా రావడం.. ఇలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని శకుంతల అంటుంది. దాంతో లక్ష్మీ బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అంత కఠినంగా లక్ష్మీతో మాట్లాడాలిసిన అవసరం ఏముంది శకుంతల.. నువ్వేనా ఇలా మాట్లాడిందని శకుంతలతో పెద్దసారు అంటాడు. నువ్వేనా స్థాయి చూసేదని పెద్దసారు అనగానే మీరు వాళ్ళ గురించి ప్రశ్నించడం నాకు నచ్చడం లేదని శకుంతల అంటుంది.
మరొకవైపు కొంచెం ఉంటే ప్రాబ్లమ్ లో పడేవాళ్ళం గంగ పైకి టాపిక్ వెళ్ళింది కాబట్టి అత్తయ్య కేసు గురించి ఏం మాట్లాడలేదని వీరు, ఇషిక అనుకుంటారు. అప్పుడే పారు ఫోన్ చేస్తుంది. ఇంట్లో జరిగిందంతా ఇషిక చెప్తుంది. ఆ తర్వాత శకుంతల అన్నమాటలు గంగ గుర్తుచేసుకొని బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |